Congress Task Force : కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ కీలక భేటీ
హాజరైన ఖర్గే..సోనియా..కీలక నేతలు
Congress Task Force : కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కొత్తగా అధ్యక్షుడు అయ్యాక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో పార్టీని విజయ పథంలోకి తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగతంగా మార్పులు చేయడం, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
సోమవారం కీలకమైన కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్(Congress Task Force) ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతోంది. ఖర్గే చీఫ్ గా ఎన్నికయ్యాక జరుగుతున్న తొలి మీటింగ్ ఇదే కావడం విశేషం. మరో వైపు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు.
వార్ రూమ్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో మాజీ కేంద్ర మంత్రి , సీనియర్ నాయకుడు పి. చిదంబరం, ముకుల్ వాస్నిక్ , జైరాం రమేష్ , కేసీ వేణుగోపాల్ , అజయ్ మాకెన్ , రణ్ దీప్ సూర్జేవాలా, ప్రియాంక గాంధీ వాద్రా, సునీల్ కనుగోలు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల కోసం ఈ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా టాస్క్ ఫోర్స్ లోని ప్రతి సభ్యునికి సంస్థ, కమ్యూనికేషన్లు, మీడియా, ఔట్ రీచ్ , ఫైనాన్స్ , ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్దిష్ట పనులు కేటాయించారు.
ఇక 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వస్తే 2019లో కేవలం 53 సీట్లతో సరి పెట్టుకుంది. పార్టీకి సంబంధించి ఎమేం నిర్ణయాలు తీసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : నెహ్రూ వల్లనే జమ్మూ కాశ్మీర్ సమస్య