Dimple Yadav Nomination : డింపుల్ యాద‌వ్ నామినేష‌న్

వెంట వ‌చ్చిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్

Dimple Yadav Nomination : మాజీ సీఎం, ఎస్పీ ఫౌండ‌ర్ దివంగ‌త ములాయం సింగ్ యాద‌వ్ మృతితో ఖాళీ ఏర్ప‌డింది యూపీలోని మెయిన్ పురి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేర‌కు మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భార్య, ములాయం కోడ‌లు డింపుల్ యాద‌వ్ బ‌రిలో నిలుచుంది.

ఇందులో భాగంగా సోమ‌వారం మెయిన్ పురి ఎంపీ సీటు కోసం ఎస్పీ అభ్య‌ర్థినిగా డింపుల్ యాద‌వ్ త‌న నామినేష‌న్(Dimple Yadav Nomination) దాఖ‌లు చేసింది. ఆమె వెంట భ‌ర్త , ఇత‌ర నేత‌లు ఉన్నారు. ఆమెకు ప్ర‌స్తుతం 44 ఏళ్లు ఉన్నాయి. గ‌తంలో ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నిక‌య్యారు. అఖిలేష్ యాద‌వ్ ను పూర్తిగా డింపుల్ యాద‌వ్ కంట్రోల్ చేస్తార‌నే ప్ర‌చారం ఉంది.

ఇది ప‌క్క‌న పెడితే నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న మామ ములాయం సింగ్ యాద‌వ్ ను గుర్తు చేసుకున్నారు. యూపీలో ప్ర‌తి ఒక్క‌రు ములాయం ను నేతాజీ అని పిలుచుకుంటారు. డింపుల్ యాద‌వ్ మ‌రోసారి త‌న మామ‌ను గుర్తు చేసుకున్నారు.

ఆయ‌న ఎక్కుడున్నా నేతాజీ ఆశీస్సులు త‌న‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని అన్నారు. ఇక మెయిన్ పురి స‌మాజ్ వాది పార్టీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. ఇక్క‌డ ములాయం సింగ్ యాద‌వ్ వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌లే కాలం చేయ‌డంతో ఈ సీటుకు ఖాళీ ఏర్ప‌డింది. గ‌తంలో డింపుల్ యాద‌వ్ పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం బ‌రిలో నిలిచారు.

Also Read : కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ కీల‌క భేటీ

Leave A Reply

Your Email Id will not be published!