Supreme Court : బలవంతపు మత మార్పిడులు ప్రమాదం
హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం
Supreme Court : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో బలవంతపు మత మార్పిడులు అత్యంత ప్రమాదకరమని, ఇది దేశానికి మంచిది కాదని హెచ్చరించింది. వీటిని గనుక అరికట్టలేక పోతే చాలా క్లిష్ట పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేసింది ధర్మాసనం.
ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బలవంతపు మత మార్పిడి సభ్య సమాజానికి మంచిది కాదని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించింది. ఈ ఆచారాన్ని అరికట్టేందుకు కేంద్ర సర్కార్ చొరవ తీసుకోవాలని సూచించింది.
దీనిని చిత్తశుద్దితో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న వాస్తవం గుర్తించాలని స్పష్టం చేసింది కోర్టు. న్యాయమూర్తులు షా, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఏమేం చర్యలు చేపట్టాలో తెలియ చేయాలని ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ముందు కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు చేపడుతుందో ముందు కోర్టుకు తెలియాలని ఆదేశించింది ధర్మాసనం(Supreme Court). ఇది దేశానికి సంబంధించిన భద్రత, మతం , మనస్సాక్షి , స్వేచ్ఛను ప్రభావితం చేసే చాలా తీవ్రమైన సమస్య అని హెచ్చరించింది.
మత మార్పిడిని అరికట్టడం అనేది ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య. దీనిని ఎందుకు ప్రయారిటీగా తీసుకోవడం లేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. బహుమతులు, ద్రవ్య ప్రయోజనాల ద్వారా బెదిరింపులు , మోస పూరితంగా ప్రలోభ పెట్టడం ద్వారా ఇలాంటివి జరుగుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఇది ఎంత మాత్రం సమాజానికి, దేశానికి మంచిది కాదని పేర్కొంది.
Also Read : సామాజిక ప్రజాస్వామ్య వాది నెహ్రూ