BJP Leaders Join : ఢిల్లీలో బీజేపీకి షాక్ ఆప్ లోకి జంప్

11 మంది సీనియ‌ర్లు పార్టీలో చేరిక‌

BJP Leaders Join : ఢిల్లీలో మున్సిప‌ల్ రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించ‌ని రీతిలో బీజేపీకి షాక్ త‌గ‌లింది. ఢిల్లీలోని రోహిణి వార్డు నెంబ‌ర్ 53 నుండి 11 మంది బీజేపీ నాయ‌కులు(BJP Leaders Join) సోమ‌వారం ఆప్ లో చేరారు.

తాము క‌ష్ట‌ప‌డినా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు గుర్తింపు రాలేద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. వారికి స‌ముచిత స్థానం కల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆప్ సీనియ‌ర్ నేత దుర్గేష్ పాఠ‌క్. ప్ర‌స్తుతం శాంపిల్ మాత్ర‌మే ఉంద‌ని రాబోయే రోజుల్లో బీజేపీ నుంచి మ‌రికొంద‌రు ఆప్ లో చేరేందుకు క్యూ క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

వీరు గ‌త 15 ఏళ్లుగా బీజేపీ కోసం ప‌ని చేశారు. కానీ వారి స‌మ‌స్య‌ల‌ను ఏనాడూ ప‌రిష్క‌రించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. కానీ ఆప్ సార‌థ్యంలోనే పాల‌న బాగుంద‌ని, బీజేపీ మాయ మాట‌లు చెబుతోందంటూ ఆప్ లో చేరిన బీజేపీ నాయ‌కులు ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆప్ లో చేరిన బీజేపీ నాయ‌కులలో(BJP Leaders Join) మాజీ వార్డు వైస్ ప్రెసిడెంట్ పూజా అరోరా, మ‌హిళా మోర్చా మాజీ ఉపాధ్య‌క్షురాలు చిత్ర లాంబా , భావా జైన్ ఉన్నారు. వీరితో పాటు కార్య‌క‌ర్త‌లంతా రోహిణి ప్రాంతంలో విస్తృతంగా ప‌ని చేస్తున్నారు. వారి చేరిక‌తో ఆప్ కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌యింద‌ని పేర్కొన్నారు దుర్గేష్ పాఠక్.

విచిత్రం ఏమిటంటే ఈసారి 20 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం విశేషం.

Also Read : బ‌ల‌వంత‌పు మ‌త మార్పిడులు ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!