Shivnath Thukral : మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా తుక్రాల్
వాట్సాప్ ఇండియా హెడ్ గుడ్ బై
Shivnath Thukral : మెటా – ఫేస్ బుక్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజ సంస్థగా పేరొందిన మెటాలో ఇప్పటికే 11 వేల మందిని సాగనంపారు. మరో వైపు టెస్లా చైర్మన్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక ఈ ఉద్యోగాల తొలగింపు పెద్ద ఎత్తున కొనసాగుతోంది.
ఈ తరుణంలో మెటాకు చెందిన వాట్సాప్ ఇండియా హెడ్ , మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీతో అత్యంత క్లోజ్ గా ఉంటారని పేరు పొందిన శివనాథ్ తుక్రాల్ కు కీలక పదవి అప్పగించి ఫేస్ బుక్. ఇప్పటి వరకు వాట్సాప్ ఇండియాలో పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా ఉన్నారు శివనాథ్ తుక్రాల్(Shivnath Thukral) .
ఇక నుంచి భారత దేశంలోని అన్ని మెటా బ్రాండ్ లకు అతనే వ్యవహరిస్తారని స్పష్టం చేసింది సంస్థ. మంగళవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఉన్న అభిజిత్ బోస్ , మెటా హెడ్ గా ఉన్న రాజీవ్ అగర్వాల్ తప్పుకున్నారు. వాట్సాప్ హెడ్ విల్ క్యాత్ కార్ట్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఇక నుంచి శివనాథ్ తుక్రాల్ చూసుకుంటారని వెల్లడించారు. ఇక వాట్సాప్ మొదటి హెడ్ గా పని చేసిన అభిజిత్ బోస్ అద్భుతమైన పనితీరు కనబర్చారంటూ ప్రశంసలు కురిపించారు. ఆయనకు మంచి జరగాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు వాట్సాప్ వరల్డ్ వైడ్ హెడ్.
Also Read : వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా