Ashwini Vaishnaw : హోసూర్ లో ఐఫోన్ తయారీ యూనిట్
వెల్లడించిన కేంద్ర మంత్రి వైష్ణవ్
Ashwini Vaishnaw : ప్రపంచ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ అమెరికాకు చెందిన ఐఫోన్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పటికే చైనా నుంచి ఇండియాలో తమ సంస్థకు చెందిన ఫోన్ల పరికరాలను తయారు చేసే యూనిట్ ను నెలకొల్పింది.
తాజాగా సదరు ఐఫోన్ సంస్థ మరో ఐఫోన్ తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు ఓకే చెప్పిందని స్పష్టం చేశారు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) .
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దిగ్గజ ఐ ఫోన్ కంపెనీ కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని హూసూర్ లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కంపెనీ తయారీ యూనిట్ వల్ల దాదపాఉ 60,000 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా హూసూర్ లో ప్లాంట్ ను కలిగి ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కు ఆపిల్ ఐఫోన్ ఎన్ క్లోజర్ ల తయారీని అవుట్ సోర్స్ చేసిందన్నారు. జంజాతీయ గౌరవ్ దివస్ వేడుకలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
రాంచీ, హజారీబాగ్ సమీపంలో నివసిస్తున్న ఆరు వేల మంది గిరిజన మహిళలు ఐఫోన్ ల తయారీలో శిక్షణ పొందారని చెప్పారు. అమెరికాకు చెందిన ఐఫోన్ లు ప్రస్తుతం దేశంలో తయారవుతున్నాయని అన్నారు. దేశంలో అతి పెద్ద ప్లాంట్ ను త్వరలోనే ఏర్పాటు చేయనుందని చెప్పారు.
60 వేల మందిలో మొదట రాంచీకి చెందిన 6 వేల మంది పని చేస్తారని ఆ తర్వాత మిగతా వారిని తీసుకుంటారని వెల్లడించారు మంత్రి.
Also Read : హోసూర్ లో ఐఫోన్ తయారీ యూనిట్