Reshma Patel : హస్తానికి షాక్ ఆప్ లో చేరిన రేష్మా పటేల్
పాటీదార్ ఉద్యమకారణిగా పేరొందారు
Reshma Patel : గుజరాత్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. దాదాపు 27 ఏళ్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాలన సాగిస్తోంది. ఈసారి ఎలాగైనా సరే మరోసారి సత్తా చాటాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నాయకత్వం వహిస్తున్నారు.
ఇక గుజరాత్ లో ఎక్కువ మంది పాటీదార్లు ఉన్నారు. వారి హక్కుల కోసం భారీ ఎత్తున ఉద్యమమే నడించింది. చాలా నియోజకవర్గాలలో వారు ప్రభావం చూపనున్నారు. ఈ తరుణంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు బలమైన నాయకుడిగా ముద్ర పడిన హర్షల్ పటేల్. ఆయన హస్తానికి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకున్నారు.
మరో వైపు ఈసారి కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) కూడా రంగంలోకి దిగింది. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం కొనసాగిస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి ఆప్ లోకి జంప్ అయ్యారు. ఇదే సమయంలో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందస్తుగా ప్రజాభిప్రాయం తీసుకుని సీఎం అభ్యర్థిని ప్రకటించారు.
ఇదే సమయంలో టికెట్లు రాని వాళ్లు ఆప్ ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా పాటీదార్ ఉద్యమకారిణి రేష్మా పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమె ఆప్ ఎంపీ, గుజరాత్ ఎన్నికల ఇం ఛార్జ్ రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రేష్మా పటేల్(Reshma Patel) చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు.
Also Read : ఎమ్మెల్యేలను మార్చం ముందస్తుకు వెళ్లం – కేసీఆర్