Elon Musk Warning : క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి లేదంటే వెళ్లిపోండి

ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ జాబ‌ర్స్ కు వార్నింగ్

Elon Musk Warning : ఏ ముహూర్తాన ట్విట్ట‌ర్ ను టెస్లా బాస్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) కొనుగోలు చేశాడో కానీ ఉద్యోగుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. రోజుకో నిర్ణ‌యంతో వారిలో మ‌రింత ఆందోళ‌న‌లు రేకెత్తిస్తున్నాడు. ఇప్ప‌టికే 4 వేల మంది ప‌ర్మినెంట్ జాబ‌ర్స్ ను ఇంటికి పంపించారు. మ‌రో 5 వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు చెక్ పెట్టాడు.

ఇక ఉచిత సౌక‌ర్యాలు ఏవీ ఇవ్వ‌నంటూ ప్ర‌క‌టించాడు. ఇక నుంచి సెల‌వులు అంటూ ఏవీ ఉండ‌వ‌న్నాడు. ఆపై ఎవ‌రైనా స‌రే ఇంటి వ‌ద్ద నుంచి ప‌ని చేస్తానంటూ కుద‌ర‌ద‌ని తేల్చాడు. ఆపై ప‌ని చేయ‌కుండా బాతాఖానీ లో మునిగి పోతే త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పేశాడు. తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు ఎలాన్ మ‌స్క్(Elon Musk).

ఇప్ప‌టికే కీల‌క‌మైన ప‌ద‌వుల్లో ఉన్న ప‌రాగ్ అగ‌ర్వాల్ , సెగెల్ , విజ‌యా గ‌ద్దెల‌ను తొల‌గించాడు. ఎవ‌రైనా వారంలో 80 గంట‌లు ప‌ని చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశాడు ట్విట్ట‌ర్ బాస్. ఇక నుంచి సంస్థ‌లో ప‌ని చేసే వారు ఎవ‌రైనా స‌రే క‌ష్ట‌ప‌డాల‌ని , వృద్దిలోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని హెచ్చ‌రించాడు.

లేదంటే మూడు నెల‌ల లోపు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేయాల‌ని వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని ఇమెయిల్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని అమెరికా మీడియా కోడై కూస్తోంది. మొత్తంగా ఇప్పుడు ఎలాన్ మ‌స్క్ పేరు చెబితే చాలు ఉద్యోగులు జంకుతున్నారు.

ఇక నుంచి అధిక ప‌ని, ఒత్తిడి, ఎక్కువ స‌మ‌యం ప‌ని ఉంటుంద‌న్నారు. చెమ‌టోడ్చి ప‌ని చేసేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు.

Also Read : టెక్నాల‌జీలో భార‌తీయుల‌దే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!