AP Govt New Brands : మద్యం బాబులకు ఖుష్ కబర్
మరో 10 కొత్త బ్రాండ్లు విడుదల
AP Govt New Brands : ఒకప్పుడు మద్యం నిషేధం. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వాలకు ఆదాయం. ఓ వైపు ఆరోగ్యం దెబ్బతింటున్నా, ఆస్పత్రుల పాలవుతున్నా సర్కార్లు పట్టించు కోవడం లేదు. ఆయా రాష్ట్రాలు పోటీ పడి మద్యాన్ని సరఫరా చేసేందుకు పర్మిషన్లు ఇస్తూ పోతున్నాయి.
విచిత్రం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఓ వైపు సంక్షేమ పథకాల జపం చేస్తూనే మరో వైపు మద్యం షాపులకు పచ్చ జెండా ఊపాయి. దీంతో కోట్లాది రూపాయల ఆదాయం ఈ రెండు రాష్ట్రాలకు వస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీ మద్యం స్కాం కూడా కలకలం రేపింది.
అయినా ఎక్కడా మద్యం ఆగడం లేదు. అమ్మకాలకు అంతకంతకూ పెరుగుతో పోతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం బాబులకు మరింత కిక్కు ఇచ్చేందుకు కొత్త బ్రాండ్లు(AP Govt New Brands) రాబోతున్నాయి. ఇప్పుడున్న బ్రాండ్లకు అదనంగా తమిళనాడుకు చెందిన కొన్ని కంపెనీలకు చెందిన బ్రాండ్లకు ఏపీ సర్కార్ లైన్ క్లియర్ ఇచ్చినట్లు సమాచారం.
ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని బ్రాండ్లకు ఈ పర్మిషన్లు ఇచ్చినట్లు టాక్. తాజాగా 10 కొత్త బ్రాండ్లను మార్కెట్ లోకి రానున్నాయి.
ఇక మద్యం బాబులకు కోరుకున్నంత మద్యం తీసుకునే అవకాశం నెలకొంది. ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆయా మద్యం దుకాణాలలో బీరు బాటిల్ ధర రూ. 200 ఉండగా కొత్త బ్రాండ్ల రాకతో ధర పెంచవచ్చని సమాచారం.
Also Read : మీడియా ఓనర్ల వల్ల డెమోక్రసీకి ముప్పు