Temperature Low : తెలంగాణ‌లో చ‌లి ‘పులి’తో గ‌జ‌గ‌జ‌

చ‌లిగాలులతో వ‌ణుకుతున్న జ‌నం

Temperature Low : రోజు రోజుకు భ‌రించ లేనిదిగా మారింది చ‌లి. ఒక ర‌కంగా చ‌లిని చూసి జ‌నం గ‌జ గ‌జ వ‌ణుకుతున్నారు. ప‌గ‌లు, రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు ఆశించిన దాని కంటే త‌క్కువ‌కు ప‌డి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చ‌లిగాలుల తీవ్ర‌త(Temperature Low) మ‌రింత పెరిగింది. చ‌లికి త‌ట్టుకోలేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయి.

ప్ర‌ధానంగా చిన్నారులు, వృద్దులు తీవ్ర అనారోగ్యానికి గుర‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆదిలాబాద్ , కుమ‌రం భీం ఆసిఫాబాద్ , మంచిర్యాల‌, నిర్మ‌ల్ , మెదక్ జిల్లాలో అత్యంత ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. వ‌రుస‌గా 9. 6 డిగ్రీల ఉష్ణోగ్ర‌త నుంచి 9.9 , 10. 5, 10.9 డిగ్రీల ఉష్ణోగ్ర‌త జిల్లాల వారీగా న‌మోదైంది.

ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోనే కాదు గ్రామీణ ప్రాంతాలు కూడా చ‌లికి వ‌ణుకుతున్నాయి. ఒక్క సంగారెడ్డి జిల్లాలో బుధ‌వారం ఒక్క రోజే 7. 2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. మ‌రో వైపు సిద్దిపేట‌, త‌దిత‌ర ప్రాంతాల్లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

ఉద‌యం లేవాలంటేనే జంకుతున్నారు. ప్ర‌ధానంగా ప‌నుల కోసం, బ‌తుకు దెరువు కోసం, వ‌ల‌స వెళ్లే వారంతా చ‌లిని చూసి జంకుతున్నారు. భ‌యాందోళ‌న‌కు గురై బ‌య‌ట‌కు రాకుండా ఇళ్ల‌ల్లోనే ఉండి పోతున్నారు. వాతావ‌ర‌ణంలో స‌మ‌తుల్య‌త లేక పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని పేర్కొంటోంది వాతావ‌ర‌ణ శాఖ‌.

విచిత్రం ఏమిటంటే ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు చ‌లి తొల‌గ‌డం లేదు. ఎండ రావ‌డం లేదు. ఇక హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చ‌లి మ‌రింత ఆందోళ‌న రేపుతోంది.

Also Read : అధికారం అప్ప‌గిస్తే అభివృద్ది చూపిస్తా

Leave A Reply

Your Email Id will not be published!