Covaxin Approval : కోవాక్సిన్ అనుమ‌తిపై రాజ‌కీయ ఒత్తిళ్లు లేవు

స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

Covaxin Approval : రాజ‌కీయ ఒత్తిళ్ల మేరకే కోవాక్సిన్ కు కేంద్ర స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాదంటూ పేర్కొంది. పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని పేర్కొంది కేంద్రం. భార‌త ప్ర‌భుత్వం – నేష‌న‌ల్ రెగ్యులేట‌ర్ – సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్సీఓ) వ్యాక్సిన్ ఆమోదంలో విధి విధానాల‌ను అనుస‌రించాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

గురువారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కోవాక్సిన్ కు(Covaxin Approval) ప‌ర్మిష‌న్ ఊరికే ఇవ్వ‌లేద‌ని పేర్కొంది. మొత్తం ప‌రిశీలించాకే అనుమ‌తి ఇచ్చామ‌ని తెలిపింది. ఇలాంటి అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయ‌వ‌ద్దంటూ కోరింది. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ కు చెందిన భార‌త్ బ‌యోటెక్ కోవాక్సిన్ ను త‌యారు చేసింది.

పొలిటిక‌ల్ ప్రెష‌ర్స్ తోనే కోవాక్సిన్ కు రెగ్యులేట‌రీ ఆమోదం హ‌డావుడిగా ఇచ్చిందంటూ జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్ర‌సారం చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కేంద్ర స‌ర్కార్ స్పందించింది. ఇదంతా ప్ర‌జ‌ల‌ను, దేశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేదిగా ఉందంటూ పేర్కొంది.

ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ నిల‌దీసింది. ఒక వ్యాక్సిన్ కు ప‌ర్మిష‌న్ ఇవ్వాలంటే చాలా తతంగం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ముందుగా లాబొరేట‌రీకి పంపిస్తార‌ని, ఆ త‌ర్వాత ఎక్స్ ప‌ర్ట్ క‌మిటీ మొత్తంగా ప‌రిశీలిస్తుంద‌ని ఆ త‌ర్వాత నివేదిక‌ల ఆధారంగా ప‌ర్మిష‌న్ ఇస్తుంద‌ని వెల్ల‌డించింది కేంద్ర మంత్రిత్వ శాఖ‌.

వ్యాక్సిన్ కోసం నిర్వ‌హించిన మూడు ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ నివేదిక‌లు పేర్కొన్నాయని చెప్ప‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని కేంద్రం సూచించింది. సీడీఎస్సీఓ కు చెందిన ఎక్ జ‌న‌వ‌రి 1 , 2 తేదీల్లో 2021న స‌మావేశ‌మైంది. చ‌ర్చ‌ల త‌ర్వాత కోవాక్సిన్ కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్లు తెలిపింది.

Also Read : అపార అనుభ‌వం అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!