Gautam Navlakha : 18న యాక్టివిస్ట్ గౌతమ్ నవ్లాఖా కేసు విచారణ
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
Gautam Navlakha : ప్రముఖ ఉద్యమకారుడు జైలు శిక్ష అనుభవిస్తున్న గౌతమ్ నవ్లాఖా పిటిషన్ పై భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు నవంబర్ 18న విచారణ చేపట్టనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా మాట్లాడారు.
నిందితుడు నవ్లాఖా తన ఇంటి చిరునామా ఇవ్వకుండా కమ్యూనిస్ట్ పార్టీ లైబ్రరీ ఆఫీసు చిరునామా ఇచ్చాడని ఆరోపించారు. అంతేకాకుండా ప్రత్యేక పిటిషన్ కూడా వేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా సోషల్ యాక్టివిస్ట్ గౌతమ్ నవ్లాఖా(Gautam Navlakha) తాజా పిటిషన్ ను శుక్రవారం విచారణకు జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ లింక్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ గృహ నిర్బంధానికి తరలించడంపై పిటిషన్ దాఖలైంది. గౌతమ్ నవ్లాఖా ఆరోగ్యం క్షీణించడంతో నవీ ముంబై లోని తలోజా జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలని నవంబర్ 10న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
గౌతమ నవ్లాఖా తరపు సీనియర్ న్యాయవాది నిత్యా రామకృష్ణన్ చేసిన వాదనలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఎన్ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది నిషేధానికి గురైన సంస్థ కాదని గౌతమ్ నవ్లాఖా తరపు న్యాయవాది వాదించారు.
నవంబర్ 15న తలోజా జైలు నుంచి గౌతమ్ నవ్లాఖా విడుదలకు ఉన్న అడ్డంకిని అత్యున్నత న్యాయ స్థానం తొలగించింది. గోరేగావ్ కేసులో ఆయనపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది.
Also Read : ఆంగ్లేయులకు సాయం చేసిన సావర్కర్