KCR Kanti Velugu : తెలంగాణ‌లో జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు

రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుకు సీఎం ఆదేశం

KCR Kanti Velugu : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు మ‌రోసారి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనిని ప్రారంభించారు. మ‌ధ్య‌లో ఆగి పోయింది. తిరిగి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు .ఈ మేర‌కు వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

తిరిగి నిర్వ‌హించాల‌ని ఆదేశించ‌డంతో సీఎస్ ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. అంత‌కు ముందు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కంటి వెలుగు కార్య‌క్ర‌మంపై సీరియ‌స్ గా రివ్యూ చేశారు. ఈ స‌మీక్ష‌లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఇందులో భాగంగా సీఎం ఎలాగైనా స‌రే కంటి వెలుగు కంటిన్యూగా (KCR Kanti Velugu) న‌డ‌వాల్సిందేన‌ని పేర్కొన్నారు. ఇది ఆపేందుకు వీలు లేద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా కంటి వెలుగును అమ‌లు చేసిన ఘ‌న‌త తెలంగాణ రాష్ట్రానికి ద‌క్కుతుంద‌న్నారు సీఎం కేసీఆర్.

ఇదిలా ఉండ‌గా ఇదే కంటి వెలుగు ప్రోగ్రామ్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా 2018 ఆగ‌స్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో సీఎం కేసీఆర్ స్వ‌యంగా ప్రారంభించారు.

ఈ అద్భుత ప‌థ‌కం ఐదు నెల‌ల పాటు కొన‌సాగింది. ఈ ఒక్క కార్య‌క్ర‌మం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా రూ. 106 కోట్లు ఖ‌ర్చు చేసింది. కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న వారికి చికిత్స‌లు చేయ‌డం, కంటి అద్దాలు , మందులు పంపిణీ చేసింది.

తిరిగి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుండ‌డంతో తెలంగాణ వారికి గొప్ప అవకాశం రానుంది.

Also Read : కోవాక్సిన్ అనుమ‌తిపై రాజ‌కీయ ఒత్తిళ్లు లేవు

Leave A Reply

Your Email Id will not be published!