Pak PM Shehbaz Sharif : ఉగ్రవాదం పాకిస్తాన్ పాలిట శాపం – పీఎం
ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని షరీఫ్
Pak PM Shehbaz Sharif : పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Pak PM Shehbaz Sharif ) సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తమ దేశంలో టెర్రరిజం ప్రధాన అవరోధంగా, సమస్యగా మారిందన్నారు. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించగలమని కానీ ఆయుధాల కంటే అత్యంత ప్రమాదకరంగా మారింది ఉగ్రవాదమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే తమ దేశానికి ప్రతిబంధకంగా, శాపంగా మారిందని వాపోయారు. ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పటికే భారత దేశం సకల అవలక్షణాలు కలిగిన దేశంగా పాకిస్తాన్ మిగిలి పోయిందని ఆరోపించింది.
ప్రతి చోటా శాంతి మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపడగలుగుతుందని పేర్కొంటూ వస్తోంది. ఇక తాజాగా పాకిస్తాన్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం పాకిస్తాన్ ఉగ్రవాదనికి అడ్డంగా మారిందంటూ ఆరోపించారు.
దీనిని తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్ పీఎం. అయితే ఉన్నట్టుండి తన స్వరం మార్చుకున్నారు. ఇప్పుడు దేశానికి ఉగ్రవాదమే ప్రథమ శత్రువుగా మారిందని పేర్కొనడం విస్తు పోయేలా చేసింది.
మొన్నటికి మొన్న మాజీ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై కూడా అటాక్ జరిగింది. దీనికి భద్రతా వైఫల్యమే కారణమని ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ లోని పోలీస్ వ్యాన్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధానమంత్రి.
Also Read : భారత్ కు జీ20 సారథ్య బాధ్యతలు