Satyendar Jain Denied Bail : ‘జైన్’ కు షాక్ మళ్లీ జైలుకే
బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
Satyendar Jain Denied Bail : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు కోలుకోలేని షాక్ తగిలింది.మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడంటూ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి. విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇక అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుంగు అనుచరుడిగా పేరొందారు. మరో వైపు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసే పనిలో ఉంది ఈడీ. ఇప్పటికే ఆయనను సీబీఐ ఢిల్లీ మద్యం పాలసీ స్కాంలో నిందితుడిగా చేర్చింది.
ఈ కేసులో 15 మందిని చేర్చగా పలువురిని అదుపులోకి తీసుకుంది. ఇక సత్యేంద్ర జైన్ కేసుకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు వింది కోర్టు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వికాస్ ధుల్ విచారణ అనంతరం బెయిల్(Satyendar Jain Denied Bail) ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పై సంచలన ఆరోపణలు చేసింది ఈడీ.
సంస్థ తరపున న్యాయవాదులు జడ్జి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణకు సహకరించడం లేదని , పూర్తిగా నిరాకరిస్తున్నారంటూ వాపోయారు. ఆయనకు గనుక బెయిల్ మంజూరు చేస్తే ఆధారాలు తారు మారు చేస్తారంటూ ఆరోపించారు. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, అంతా కావాలని దాట వేస్తున్నాడంటూ మండిపడ్డారు.
దీంతో కేసు ముందుకు సాగడం లేదని లేట్ అవుతోందంటూ తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి సత్యేంద్ర జైన్ కు బెయిల్ ఇవ్వలేమంటూ కుండ బద్దలు కొట్టారు.
Also Read : నేను సీఎంను ఎక్కడికీ పారిపోను – సోరేన్