Uddhav Thakeray Rahul : రాహుల్ కామెంట్స్ ను అంగీకరించం
స్పష్టం చేసిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే
Uddhav Thakeray Rahul : భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు వీడీ సావర్కర్ పై. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా తన భాగస్యామ్య పక్షంగా ఉన్న శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే స్పందించారు.
ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. కానీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్తలో ఒకరిగా భావించే వీర సావర్కర్ గురించి కామెంట్స్ చేయడాన్ని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఓ వైపు భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశం స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే సావర్కర్ మాత్రం ఆంగ్లేయులకు సపోర్ట్ గా ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.
అంతే కాకుండా సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లను భయానికి సంకేతాలన్నాడు. దీనిపై సీరియస్ గా స్పందించారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన దానితో తాము ఏకీభవించడం లేదన్నారు. వీర్ సావర్కర్ ను గౌరవిస్తాం.
అయిదే అదే సమయంలో మరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పీడీపీతో ఎందుకు అధికారంలో ఉన్నారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. హిందూత్వ వారసత్వం , పీడీపీ ఎప్పుడూ కూడా భారత్ మాతా కీ జై అనదని మండిపడ్డారు మాజీ సీఎం, శివసేన చీఫ్(Uddhav Thakeray ).
స్వాతంత్రాన్ని కాపాడుకునేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాని చెప్పారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ వీడీ సావర్కర్ రాసిన లేఖను చూపించారు. ఇందులో వీర సావర్కర్ ఏమి రాశాడో చెప్పాడు. సర్ మీ అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉండమని నేను వేడుకుంటున్నానని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
Also Read : భార్య కోసం మామను కలిసిన అల్లుడు