CV Ananda Bose : బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్
ఇప్పటి దాకా కొనసాగిన మణిపూర్ గవర్నర్
CV Ananda Bose : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్ గా రిటైర్డ్ బ్యూరోక్రాట్ సీవీ ఆనంద బోస్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. అంతకు ముందు గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతిగా ఘన విజయాన్ని నమోదు చేశారు.
ఆయన స్థానంలో తాత్కాలిక గవర్నర్ గా మణిపూర్ గవర్నర్ లా గణేశన్ ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర సర్కార్ మధ్య పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కొత్త ప్రయోగం చేసింది. సీవీ ఆనంద బోస్ ను(CV Ananda Bose గవర్నర్ గా ప్రమోట్ చేసింది. ఆయనకు ఇప్పుడు 71 ఏళ్లు. కేరళ కేడర్ నుండి 1977 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా ఉన్నారు. రాష్ట్రంలో , కేంద్రంలో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహించారు ఆనంద బోస్.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. ఇక సీవీ ఆనంద బోస్ తన సుదీర్ఘ కెరీర్ లో జిల్లా కలెక్టర్ గా, ప్రధాన కార్యదర్శిగా, కేంద్రంలో కార్యదర్శిగా , యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా అనేక కీలక పదవులు చేపట్టారు.
సీవీ ఆనంద బోస్ నిర్మితి కేంద్రం, సరసమైన తక్కువ ధర గృహ ప్రాజెక్టు వంటి అనేక సంస్థలను స్థాపించాడు. 2018లో బీజేపీలో చేరారు. మేఘాలయ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నారు.
Also Read : సౌమ్య స్వామినాథన్ రాజీనామా