LT Governor Locks : డిడిడిసీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ఆఫీసుకు తాళం

ముదిరిన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సీఎం వివాదం

LT Governor Locks : ఢిల్లీలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స‌ర్కార్ కు మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు ఆదేశించ‌డం, దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఇదే క్ర‌మంలో డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా తో పాటు మ‌రో 14 మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది.

ఈ మేర‌కు ఇప్ప‌టికే ఈడీ జ‌ల్లెడ ప‌డుతోంది. ఈ త‌రుణంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్. ప్ర‌స్తుతం ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలో ఆప్ గొడ‌వ‌తో ఎల్జీ స‌క్సేనా(LT Governor Locks) ఉన్న‌త స్థాయి అధికారి కార్యాల‌యానికి తాళం వేశారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జాస్మిన్ షా కు సంబంధించిన షామ్ నాథ్ మార్గ్ ఆఫీసుకు తాళం వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అధికారిక వాహ‌నంతో పాటు ఆనుభ‌వించిన అన్ని ఇత‌ర సౌక‌ర్యాల‌ను త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా ఆదేశాలు జారీ చేశారు.

ఒక ర‌కంగా ఆప్ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు స‌క్సేనా. ఈ మేర‌కు ఢిల్లీ ప్ర‌భుత్వ థింక్ థాంక్స్ డైలాగ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ క‌మిష‌న్ ఆఫ్ ఢిల్లీ వైస్ చైర్ ప‌ర్స‌న్ జాస్మిన్ షా త‌న కార్యాల‌యాన్ని ఉప‌యోగించ‌కుండా ఆంక్ష‌లు విధించారు.

ఇదిలా ఉండ‌గా డీడీడీసీ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి నుండి జాస్మిన్ షాను తొల‌గించాల‌ని స‌క్సేనా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను కోరిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌ద‌వి ఢిల్లీ ప్ర‌భుత్వ మంత్రి హోదాకు స‌మానం.

Also Read : ఈడీ డైరెక్ట‌ర్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!