Vikram S Launch : నింగికేగిన విక్రమ్ – ఎస్ రాకెట్
తొలి ప్రైవేట్ రాకెట్ విజయంతం
Vikram S Launch : అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలు రాయిని సాధించింది. ఇప్పటికే పలు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా మరో చరిత్ర సృష్టించింది. ఒక రకంగా ఇది చిరస్మరణీమైన రోజుగా అభివర్ణించక తప్పదు. దేశంలోనే మొట్ట మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించారు దీనిని. ఉదయం 11.30 గంటలకు విక్రమ్ – ఎస్ రాకెట్ ను ప్రయోగించారు. హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ (అంకుర సంస్థ) అయిన స్కై రూట్ ఏరో స్పేస్ ఈ రాకెట్ ను రూపొందించింది (తయారు చేసింది).
ఇదిలా ఉండగా దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉండగా విక్రమ్ సారా భాయ్ పేరు మీద దీనికి విక్రమ్ – ఎస్(Vikram S Launch) అని నామకరణం చేశారు. ఈ రాకెట్ పొడవు 6 మీటర్లు ఉండగా 545 కిలోల బరువు కలిగి ఉంది. భారత్, అమెరికా , సింగపూర్, ఇండోనేషియా కు చెందిన విద్యార్థులు అభివృద్ది చేశారు.
వీరు 2.5 కిలోల పేలోడ్ కు చెందిన ఫన్ శాట్ తో పాటు చెన్నైకి చెందిన ఏరో స్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ కూడా ఉన్నాయి. కాగా ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది. ఇదిలా ఉండగా ఇటీవలే మీడియా సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్కై రూట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో రాకెట్ ను తయారు చేశారని ప్రశంసలు కురిపించారు. కానీ దీని గురించి ఎవరూ రాయడం లేదని వాపోయారు. కానీ ఇవాళ స్కై రూట్ పేరు తెలిసి పోయింది ఈ రాకెట్ ప్రయోగం ద్వారా.
Also Read : నాలుగు ఎయిర్ లైన్స్ లు ఒకే గూటికి