PM Modi Inaugurate : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎయిర్ పోర్ట్ రెడీ

ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి మోదీ

PM Modi Inaugurate : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో కొత్త ఎయిర్ పోర్టును ప్రారంభించ‌నున్నారు. గ‌త ఎనిమిదేళ్ల‌లో ఈశాన్య ప్రాంతంలో నిర్మించిన ఏడో విమానాశ్ర‌యం ఇది. గంట‌కు 200 మంది ప్ర‌యాణీకుల గ‌రిష్ట నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంది. రాష్ట్రంలోని డోనీ పోలోలో ఎయిర్ పోర్ట్ ను కొత్త‌గా నిర్మించారు.

మొత్తం ఎనిమిది ఈశాన్య రాష్ట్ర రాజ‌ధానులు దీంతో ఇప్పుడు విమానాశ్ర‌యాల‌ను క‌లిగి ఉంటాయి. ఈశాన్య భార‌తంలో ఇదే మొద‌టి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కావ‌డం విశేషం. ఇంత‌కు ముందు ఇటాన‌గ‌ర్ నుండి విమానాలు ఎక్కేందుకు అస్సాంలోని దిబ్రూగ‌ర్ లేదా గౌహ‌తికి ఆరు నుండి ప‌ది గంట‌లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

అయితే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సంప్ర‌దాయాలు, సుసంప‌న్న‌మైన సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ప్ర‌తిబింబించేలా తీర్చిదిద్దారు. కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ఎయిర్ పోర్టులు(PM Modi Inaugurate)  నిర్మిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఇది మూడో ఆప‌రేష‌న్ ఎయిర్ పోర్టు.

ఇంత‌కు ముందు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మ‌రో రెండు ప‌ట్ట‌ణాలు పాసిఘ‌ట్ , తేజు ప్రాంతాల‌లో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఉడాన్ ప‌థ‌కం కింద లింక్ చేయ‌బ‌డ్డాయి. ఇక కొత్త ఎయిర్ పోర్ట్ 2,300 మీట‌ర్ల ర‌న్ వేని క‌లిగి ఉంది. బోయింగ్ 747 వంటి భారీ విమానాల‌ను న‌డిపేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దారు.

డోనీ పోలో విమానాశ్ర‌యాన్ని 690 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 640 కోట్ల‌కు పైగా ఖ‌ర్చుతో అభివృద్ది చేశారు. గ‌త ఫిబ్ర‌వ‌రి 2019లో ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా దీనికి శంకుస్థాప‌న చేశారు.

Also Read : భార‌త్ కు ఫ్రాన్స్ కీల‌క మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!