Arun Goyal : కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Arun Goyal : గుజరాత్ లో కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఉన్నతాధికారి అరుణ్ గోయల్ ను నియమించింది. 1985 బ్యాచ్ కి చెందిన పంజాబ్ క్యాడర్ అధికారి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ , ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో పోల్ ప్యానల్ లో చేరనున్నారు.
దేశంలోని అత్యున్నత పోల్ బాడీలో మూడో పోస్టు దాదాపు ఆరు నెలలు ఖాళీగా ఉంది. అరుణ్ గోయల్(Arun Goyal) ను కేంద్ర ఎన్నికల కమిషనర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేయడంతో రాజీవ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.
ఆనాటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు సభ్యులతోనే పని చేస్తోంది. ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలుకుతోందన్న విమర్శలు లేక పోలేదు.
మరో వైపు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్(Hemant Soren) పై అనర్హత వేటు వేస్తుందా లేదా అన్నది ప్రస్తుతం కొత్తగా నియమితులైన అరుణ్ గోయల్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే నెలల్లో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించాల్సి ఉంది.
Also Read : ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చీఫ్ పై ఛార్జ్ షీట్