Shashi Tharoor Cartoon : శశి థరూర్ 1919 కార్టూన్ హల్ చల్
వైరల్ గా మారిన ఆనాటి కార్టూన్
Shashi Tharoor Cartoon : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, రచయిత శశి థరూర్ (Shashi Tharoor) మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయన ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అంశాన్ని ముందుకు తీసుకు వస్తారు. ప్రశ్నించేలా చేస్తారు. ఆపై వెదికేలా చేస్తారు ఆయన.
రాబోయే సంవత్సరాల్లో టెక్నాలజీ మానవ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేసే పాత కాలం నాటి కార్టూన్ ను పంచుకున్నారు ట్విట్టర్ వేదికగా. ఈ కార్టూన్ ను దేశానికి స్వాతంత్రం రాక ముందు వేసింది. ఈ అద్భుతమైన కార్టూన్ ను 1919లో వేశారు.
ఈ కార్టూన్ కు అందమైన క్యాప్షన్ కూడా జత చేర్చారు. ఇందులో పాకెట్ టెలిఫోన్.. ఎప్పుడు రింగ్ అవుతుంది అంటూ ఒక వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ రింగ్ అయిన సమయంలో వివిద సందర్భాలను వర్ణిస్తుంది. ఈ సందర్భంగా శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్టూన్ గురించి, అది అందించే సందేశం గురించి తన భావాలను పంచుకున్నారు కాంగ్రెస్ అగ్ర నేత. ఎంతో ఆసక్తికరంగా, సాంకేతిక పురోగతి , మన జీవితాలపై దాని లోతైన ప్రభావాలతో మానవులుగా మనం చేరుకున్న ప్రదేశాన్ని ఇది పోలి ఉంటుందని పేర్కొన్నారు శశి థరూర్(Shashi Tharoor).
ఈ కార్టూన్ కు ఆయన అందమైన శీర్షిక కూడా జోడించారు. పాకెట్ టెలిఫోన్ .. ఎప్పుడు రింగ్ అవుతుంది అని. ఆవిష్కరణల మార్గంలో తాజా ఆధునిక భయానకమైనది పాకెట్ టెలిఫోన్. కొద్దిగా నమ్మశక్యం కాని సాంకేతికత గురించి అంచనాలు కొన్నిసార్లు వింతగా ఉండేవి.
1919 కార్టూన్ చూడండి. ఫిక్స్ డ్ లైన్ టెలిఫోన్లు ఇప్పటికీ చాలా అరుదుగా ఉన్నాయని పేర్కొన్నారు శశి థరూర్. చాలా మంది నెటిజన్లు కార్టూనిస్టు మందు చూపును చూసి విస్తు పోయారు.
Also Read : దేశంలో తొలి పురుష స్త్రీ వాది అంబేద్కర్