White House Praises : జీ20 సదస్సులో మోదీ పాత్ర భేష్ – యుఎస్
ప్రధానమంత్రికి కితాబు ఇచ్చిన వైట్ హౌస్
White House Praises : ఇండోనేషియాలోని బాలిలో జరిగిన 20 శిఖరాగ్ర సమావేశంలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన పాత్ర పోషించారని కితాబు ఇచ్చింది అమెరికా. ఈ జీ20 గ్రూపులో 19 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. యూకే, అమెరికా, ఇండియా, ఇండోనేషియా, చైనా, ఫ్రాన్స్ , ఆస్ట్రేలియా , తదితర ముఖ్యమైన దేశాలకు చెందిన అధినేతలు, ప్రధానమంత్రులు పాల్గొన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి భారతం దేశం జీ20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా వైట్ హౌస్(White House Praises) కీలక వ్యాఖ్యలు చేసింది. భారత దేశం డిసెంబర్ లో జి20 అధ్యక్ష పదవిని స్వీకరించనుంది. ఇది గ్రూప్ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించింది అమెరికా. జీ సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి మోదీ అత్యంత ప్రభావితం చేశారంటూ పేర్కొంది వైట్ హౌస్.
బాలి డిక్లరేషన్ పై చర్చలు జరపడంలో భారత దేశం కీలక పాత్ర పోషించిందని కితాబు ఇచ్చింది. నేటి ప్రపంచ యుగం యుద్ధంగా ఉండ కూడదని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
సమ్మిట్ ప్రకటనపై చర్చలు జరపడంలో భారత దేశం నిర్వహించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ .
మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తావించబడిన ఇతర ప్రాధాన్యతలలో ప్రస్తుత ఆహార , ఇంధన భద్రత సవాళ్లను పరిష్కరించేందుకు తమకు ఒక మార్గం ఉందన్నారు.
వచ్చే ఏడాది భారత దేశం ఆధ్వర్యంలో జీ20 గ్రూప్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Also Read : ఉక్రెయిన్ కు భరోసా జెలెన్ స్కీకి ఆసరా