Arvind Kejriwal : పాఠశాలలు..ఆస్పత్రులకు ప్రయారిటీ
స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : కేంద్రం ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మిస్తామని స్పష్టం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిసెంబర్ లో ఢిల్లీ మహానగర ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలో హోరా హోరీగా ప్రచారం చేపట్టారు. ఢిల్లీలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు.
విద్య, ఆరోగ్యం, ఉపాధి, మహిళా సాధికారత పై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పాఠశాలలను ఏర్పాట చేశామన్నారు. కేంద్రం కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . మరో వైపు ఢిల్లీతో పాటు గుజరాత్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు.
27 ఏళ్లుగా ఇక్కడ కాషాయ పార్టీ కొలువు తీరింది. మరోసారి పవర్ లోకి వచ్చేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ముందస్తుగా ఆప్ తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఈ రాష్ట్రానికి ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎంపీ రాఘవ్ చద్దాను నియమించారు కేజ్రీవాల్.
ఇదే సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన భుజాలపై వేసుకున్నారు. మొత్తంగా కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal) .
Also Read : మోర్బీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్