YS Sharmila : జయశంకర్ సార్ ఊరును విస్మరించిన కేసీఆర్
కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఆమె సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర హన్మకొండ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను ఏనాడో మరిచి పోయాడని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సారు సొంతూరును పట్టించు కోలేదన్నారు. గ్రామంలో గ్రంథాయలం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆదర్శ గ్రామంగా ప్రకటించిండు. రోడ్లు కూడా లేకుండా చేశాడంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల(YS Sharmila). గాలి మాటలు సొల్లు కబుర్లు చెప్పడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని, రాచరిక పాలన సాగుతోందన్నారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పేదోళ్లను ఆదుకోవాల్సిన సీఎం ఫామ్ హౌస్ లో పడుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకుడు సీఎంగా ఉండడం తెలంగాణ వాసుల ఖర్మ అని అన్నారు.
కాళేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఎందుకని కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఆయనకు ఓట్లు, నోట్లు తప్ప ఇంకేమీ పట్టదన్నారు. దొర దురహంకారంతో పాలిస్తున్న కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.
గతంలో ఎందరికో నీడను కల్పించిన ఘనత దివంగత వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : నోట్లు..ఓట్లు తప్ప కేసీఆర్ కు ఏవీ పట్టవు