Sanjay Gaikwad : మరాఠా గవర్నర్ ను వేరే చోటుకు పంపండి
బీజేపీకి ఏక్ నాథ్ షిండే టీమ్ విన్నపం
Sanjay Gaikwad : మరాఠా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఛత్రపతి శివాజీ పై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీంతో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి శివసేన తిరుగుబాటు ఏక్ నాథ్ షిండే వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
బుల్దానా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గైక్వాడ్ , కోష్యారీ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పై గతంలో కూడా గవర్నర్ ఇలాగే కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు. గవర్నర్ ను వేరే చోటుకు పంపించాలని కోరారు. ఏక్ నాథ్ షిండే వర్గంలో కీలక నాయకుడిగా ఉన్నారు ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ డిమాండ్ చేశారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలకు ఎప్పటికీ వయో వృద్దాప్యం లేదని ప్రపంచంలోని మరే ఇతర గొప్ప వ్యక్తితోనూ ఆయనను పోల్చ లేరన్నారు. రాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు సంజయ్ గైక్వాడ్(Sanjay Gaikwad) . విచిత్రం ఏమిటంటే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి , సీనియర్ నాయకులకు రాష్ట్ర గవర్నర్ కు ఇక్కడి చరిత్ర తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు.
ఇకనైనా గవర్నర్ కోష్యారీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు బేషరతుగా చెప్పాలని డిమాండ్ చేశారు సంజయ్ గైక్వాడ్. ఇదిలా ఉండగా షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే గవర్నర్ పై నిప్పులు చెరగడం కలకలం రేపింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే రాష్ట్రం రావణ కాష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత షిండేపై ఉందన్నారు ఎమ్మెల్యే.
Also Read : సంజయ్ రౌత్ ఆరోగ్యంపై రాహుల్ ఆరా