Malla Reddy IT Raids : ఐటీ దాడులు కళ్లు చెదిరే నోట్ల కట్టలు
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బాగోతం
Malla Reddy IT Raids : తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రికి సంబంధించిన ఇళ్లు, ఆస్తులు, కార్యాలయాలపై దాడులు చేయడం విస్తు పోయేలా చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కోలుకోలేని రీతిలో షాక్(Malla Reddy IT Raids) ఇచ్చింది.
ఏకంగా 50 ప్రాంతాలలో మూకుమ్మడి సోదాలు చేపట్టారు. పెద్ద ఎత్తున కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఐటీ దాడుల్లో భాగంగా మల్లారెడ్డికి చెందిన బంధువులు, సన్నిహితులు ఇళ్లల్లో కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. రూ. 4 కోట్లకు పైగా నగదు పట్టు పడింది.
మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ బృందాలు దాడులు కొనసాగుతూ వస్తున్నాయి. కొడుకు మహేందర్ రెడ్డి, సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి , తన వద్ద పీఎస్ గా పని చేస్తున్న సంతోష్ రెడ్డి, కూతురు, క్రాంతి బ్యాంకు చైర్మన్ రాజేశ్వర్ రావు , క్యాసినో వ్యవహారంలో కీలకంగా ఉన్న జై కిషన్ , తదితరులపై మూకుమ్మడిగా సోదాలు చేయడం కోలుకోలేని షాక్ కు గురి చేసింది.
దాడుల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ చుక్కలు చూపించింది. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు పట్టు పడింది.
పలు కాలేజీలు నడుపుతున్నారు. కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్లు సీజ్ చేశారు. భద్రా రెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డి ఇళ్లలోనూ జల్లెడ పట్టారు. అల్లుడు సంతోష్ రెడ్డి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.
Also Read : మల్లారెడ్డి మామూలోడు కాదప్పా