E Palaniswami : డీఎంకే పాలనలో పెచ్చరిల్లిన అవినీతి – ఈపీఎస్
గవర్నర్ ను కోరిన అన్నాడీఎంకే చీఫ్
E Palaniswami : అన్నాడీఎంకే చీఫ్ ఎడాపడి పళని స్వామి (ఈపీఎస్) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడులో కొలువు తీరిన డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో అవినీతి , అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా డీఎంకే సర్కార్ చేస్తున్న దారుణాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. పాలనా పరంగా రాష్ట్రం విఫలమైందని ధ్వజమెత్తారు. కోయంబత్తూరు పేలుళ్లపై సర్కార్ సకాలంలో స్పందించ లేదంటూ మండిపడ్డారు ఈపీఎస్.
గత అక్టోబర్ 23న కోయంబత్తూరు కారు పేలుడు ఘటనలో నిందితుడు మృతి చెందాడని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఎడప్పాడి పళని స్వామి(E Palaniswami) ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు కలిసి గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలిశారు.
ఈ సందర్భంగా కొద్ది సేపు ఆయనతో ముచ్చటించారు. ప్రధాన సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ ఏకైక లక్ష్యం అవినీతి, వసూళ్లు, కమీషన్ మాత్రమేనని ఈపీఎస్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మేరకు 18 పేజీల వినతిపత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఈపీఎస్ అందజేసిన వినతిపత్రం చదివిన గవర్నర్ విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
హత్యలతో సహా నేరాలు, ఘోరాలు రోజూ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా స్టాలిన్ కు లేకుండా పోయిందన్నారు పళని స్వామి.
Also Read : భగత్ సింగ్ కోష్యారీ గవర్నర్ కు తగడు – పవార్