Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ కే మళ్లీ పట్టం
డీఎంకే యువజన విభాగం అతడికే
Udhayanidhi Stalin : డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి యువజన విభాగం పదవి దక్కింది. ప్రస్తుతం స్టాలిన్ తర్వాత అంతటి ప్రాముఖ్యత, ఆదరణ కలిగిన నాయకుడిగా ఎదిగాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి తరపున విస్తృతంగా ప్రచారం చేపట్టాడు.
తండ్రికి తనయుడిగా తాత కరుణానిధికి తగ్గ వారసుడిగా పేరొందాడు. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో, యువతను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాడు. డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తాజాగా కార్యవర్గాన్ని మరింత బలోపేతం దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది డీఎంకే.
ఈసారి కూడా ఉదయనిధి స్టాలిన్ కే (Udhayanidhi Stalin)మళ్లీ పదవి వరించింది. ఈ విభాగంలో గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎనిమిది మందికి కొత్తగా చోటు కల్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళికి షాక్ తగిలింది. ఆమెను కాదని కనిమొళి నిర్వహిస్తున్న మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని నాగర్ కోయిల్ కు చెందిన హెలెన్ డేవిడ్సన్ కు అప్పగించారు.
ఈ నిర్ణయం పార్టీ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది. ఇదిలా ఉండగా పార్టీ మొత్తం ఇప్పుడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ కనుసన్నలలోనే నడుస్తోందన్న విమర్శలు లేక పోలేదు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ చేపాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
అద్భుత విజయాన్ని నమోదు చేశారు. సక్సెస్ ఇచ్చిన జోషల్ లో ఉన్న ఉదయనిధి స్టాలిన్ కు యువజన విభాగం కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వెల్లడించారు.
Also Read : డీఎంకే పాలనలో పెచ్చరిల్లిన అవినీతి – ఈపీఎస్