Elon Musk Hires : హ్యాకర్ ఎక్స్ పర్ట్ జార్జ్ హాట్జ్ కు మస్క్ ఛాన్స్
ఐఫోన్ లను హ్యాచ్ చేసిన యువ టెక్ హ్యాకర్
Elon Musk Hires : ఎవరీ జార్జ్ హాట్జ్ అనుకుంటున్నారా. యంగ్ టెక్కీ హ్యాకర్ ఎక్స్ పర్ట్. మనోడు ఏకంగా టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మనోడిని ఆకట్టుకున్నాడు ఈ యంగ్ టెక్కీ. ఇప్పటికే ట్విట్టర్ లో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే పర్మినెంట్ ఎంప్లాయిస్ 6 వేల మందిని తొలగించాడు.
ఆపై కాంట్రాక్టు కింద పని చేస్తున్న 5 వేల మందిని సాగనంపాడు. ఈ తరుణంలో కేవలం పని చేస్తున్న వారు మాత్రమే ఉండాలని స్పష్టం చేశాడు. ఎవరూ ఇంటి వద్ద నుంచి పని చేయవద్దని పేర్కొన్నాడు. ఆపై ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే ట్విట్టర్ ఆఫీసులకు రావాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటి వరకు భారత దేశానికి చెందిన మరో టెక్కీ నిపుణుడు శ్రీరామ కృష్ణన్ సూచనలు , సలహాలు తీసుకుంటూ వచ్చారు ఎలాన్ మస్క్. ఈ తరుణంలో మరో సంచలన ప్రకటన చేశారు ట్విట్టర్ బాస్(Elon Musk Hires). ట్విట్టర్ లో బగ్స్ గుర్తించి, హ్యాకింగ్ కాకుండా ఉండేందుకు గాను ప్రముఖ ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ లను హ్యాక్ చేసి సంచలనం రేపిన జార్జ్ హాట్జ్ ను నియమించుకున్నాడు.
ఈ విషయాన్ని జార్జ్ హాట్జ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇదే సమయంలో అతడికి అవకాశం ఇచ్చినట్లు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. అయితే పర్మినెంట్ గా మాత్రం కాదు. కేవలం 12 వారాల పాటు ట్విట్టర్ ఇంటర్న్ గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read : ఉన్న ఉద్యోగాలకు కంపెనీలు ఎసరు