Nirmala Sitharaman : బ‌డ్జెట్ తయారీకి సూచ‌న‌లు ఇవ్వండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

Nirmala Sitharaman : రాబోయే సంవ‌త్స‌రానికి 2023-24కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక బ‌డ్జెట్ ను త‌యారీ చేసే ప‌నిలో ప‌డింది. ఈ మేర‌కు ఆదివారం కేంద్ర విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఔత్సాహికులు, మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు దేశం కోసం విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరారు కేంద్ర మంత్రి. ఈ మేర‌కు మై గ‌వ‌ర్న‌మెంట్ ప్లాట్ ఫాం నుండి విన్న‌వించారు.

స‌మ‌గ్ర వృద్దితో భార‌త దేశాన్ని ప్ర‌పంచ ఆర్థిక శ‌క్తిగా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డే ఆలోచ‌న‌లు, సూచ‌న‌ల‌ను ద‌య‌చేసి పంచు కోవాల‌ని ఆమె కోరారు. మీరు అందించే ప్ర‌తి ఒక్క ఆలోచ‌న‌ను, సూచ‌న‌ల‌ను తాము ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు నిర్మ‌లా సీతారామ‌న్. ఇదిలా ఉండ‌గా విత్త మంత్రి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి.

ప్ర‌ధానంగా కేంద్రంలో న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం పారిశ్రామిక‌వేత్త‌లు, ఆర్థిక నేర‌గాళ్లు, కార్పొరేట్లు , బిజినెస్ టైకూన్ల‌కు మేలు చేకూర్చేలా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే కోట్లాది ఆదాయం క‌లిగిన ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను న‌ష్టాల పేరుతో గంప గుత్త‌గా అమ్మ‌కానికి పెట్టిన ఘ‌న‌మైన చ‌రిత్ర నిర్మలా సీతారామ‌న్(Nirmala Sitharaman) ది.

వ్య‌వ‌స్థ‌ల‌ను, సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నా ఎందుక‌ని ఆర్థిక శాఖ మంత్రి నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగినా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు.

Also Read : మోదీ మోసం యుద్దానికి సిద్దం – టికాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!