YS Sharmila Arrest : తెలంగాణలో రాజకీయాలు కాకా రేపుతున్నాయి. గత కొంత కాలం నుంచీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఆమె ప్రధానంగా సీఎం కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రతి రోజూ తూర్పార బడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందని, ఎందుకు కేసీఆర్ ను(CM KCR), కుటుంబాన్ని అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో వరంగల్ జిల్లా నర్సంపేటలో తాను చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు.
ఆయనపై నిప్పులు చెరిగారు. ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడు పోయాయంటూ సంచలన ఆరోపణలు సైతం చేశారు.
ఇదే సమయంలో షర్మిల చేపట్టిన పాదయాత్రకు భారీ ఎత్తున జనాదరణ లభిస్తోంది. ఈ తరుణంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ఎమ్మెల్యేను దూషిస్తావా అంటూ షర్మిల ప్రచార రథం (బస్సు)ను తగుల బెట్టారు.
దీంతో తనను కావాలనే టార్గెట్ చేశారని, తాను ప్రశ్నిస్తున్నందు వల్లనే వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇరు వర్గాల ఘర్షణలో పరిస్థితి అదుపు తప్పడంతో వైఎస్ షర్మిలను(YS Sharmila Arrest) వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అక్కడి నుంచి తరలించారు.
Also Read : అరెస్ట్ చేసేందుకే బస్సు తగుల బెట్టారు