Jyotiraditya Scindia : రాహుల్ యాత్ర‌పై సింధియా సెటైర్

నార్త్ ఈస్ట్ రియ‌ల్ ఎయిర్ క‌నెక్టివిటీ

Jyotiraditya Scindia : కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌పై సెటైర్లు వేశారు. ఆ యాత్ర‌కు అర్థం లేద‌ని, త‌లా తోకా లేని యాత్ర అని ఎద్దేవా చేశారు.

సోమ‌వారం ఇటాన‌గ‌ర్ ను కోల్ క‌తా మీదుగా ముంబైకి క‌లిపే న్యూఢిల్లీ నుండి ఇండిగో విమాన కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). రాహుల్ కు అంత సీన్ లేద‌న్నారు. ఆ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌న్నారు. న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో భార‌త దేశం అన్ని రంగాల‌లో అభివృద్ది ప‌థంలో ప‌య‌నిస్తోంద‌న్నారు.

భార‌త్ జోడో అంటే ఆయా రాష్ట్రాల‌ను క‌ల‌ప‌డం, అభివృద్దిలో భాగ‌స్వాముల‌ను చేయ‌డం, అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డమ‌న్నారు కేంద్ర మంత్రి. అన్ని రాష్ట్రాల‌తో ఈశాన్య ప్రాంతంతో వాయు, రైలు క‌నెక్టివిటీ నిజ‌మైన భార‌త్ జోడోగా అభివ‌ర్ణించారు.

మెట్రో పాలిట‌న్ న‌గ‌రాలైన ముంబై, కోల్ క‌తాతో హోలోంగీ విమానాశ్ర‌యం నుండి ఎయిర్ క‌నెక్టివిటీని ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు జ్యోతిరాదిత్య సింధియా. ఇదిలా ఉండ‌గా ఇటాన‌గ‌ర్ ఎయిర్ పోర్ట్ ను హోలోంగి ఎయిర్ పోర్ట్ అని కూడా పిలుస్తారు.

అధికారికంగా డోనీ పోలో అని విమాన‌శ్ర‌యంగా మార్చారు. ఇది అరుణాచ‌ల్ ప్ద‌రేశ్ రాజ‌ధాని ఇటాన‌గ‌ర్ కు సేవ‌లు అందించే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కావ‌డం విశేషం.

కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : ఆసామీల‌కు దోచి పెడుతున్న మోదీ – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!