CM KCR : ముగిసిన టూర్ కేసీఆర్ ఖుష్

2023 నాటికి యాదాద్రి విద్యుత్ ప్లాంట్ రెడీ

CM KCR : ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌ల్ల‌గొండ జిల్లా ప‌ర్య‌ట‌న ముగిసింది. దామ‌ర‌చ‌ర్ల‌లో ఏర్పాటు చేసిన యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను కేసీఆర్ ప‌రిశీలించారు. సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అనంత‌రం ఆయ‌న హైద‌రాబాద్ కు వ‌చ్చేశారు. ఇదిలా ఉండ‌గా శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నుల‌ను సీఎం(CM KCR) ఏరియ‌ల్ వ్యూ ద్వారా ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ప‌నుల వివ‌రాల‌ను ఉన్న‌తాధికారులు సీఎంకు వివ‌రించారు. వ‌చ్చే సంవ‌త్స‌రం 2023 డిసెంబ‌ర్ నాటికి యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావాల‌ని కేసీఆర్ ఆదేశించారు. ఎక్క‌డా ఆల‌స్యం జ‌ర‌గ కూడ‌ద‌న్నారు.

వెంట‌నే విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించాల‌ని సూచించారు. దీని ద్వారా తెలంగాణ యావ‌త్ రాష్ట్రానికి యాదాద్రి నుంచి వెలుగులు పంచాల‌ని కోరారు. ఇది త‌న చిర‌కాల స్వ‌ప్న‌మ‌ని పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఈ నేల క‌రువుకు ఏడ్చింది. నీళ్లు లేక త‌ల్ల‌డిల్లింది. ప‌రాయి పాల‌న‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నం. గేలి చేసిన వాళ్లు గాల్లో క‌లిసి పోయారు. కానీ అనుకున్న‌ది సాధించిన‌. ఇప్పుడు నా క‌ళ్ల ముందు తెలంగాణ స్వ‌ప్నం సాకారం అయ్యింద‌న్నారు కేసీఆర్(CM KCR). దేశంలో ఒక‌ప్పుడు పంజాబ్ ధాన్యాగారంగా ఉండేది.

కానీ ఇవాళ తెలంగాణ మ‌ణిహారంగా మారింద‌న్నారు కేసీఆర్. ఇదే స‌మ‌యంలో విద్యుత్ కోత‌ల‌తో యావ‌త్ తెలంగాణ ప్ర‌జానీకం, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ప‌డింది. కానీ ఆ క‌ష్టం కూడా తీరింద‌న్నారు. ఈ ఒక్క విద్యుత్ ప్లాంట్ పూర్త‌యితే తెలంగాణ విద్యుత్ రంగంలో స్వ‌యం స‌మృద్దిని సాధిస్తుంద‌న్నారు కేసీఆర్.

Also Read : వైస్ ష‌ర్మిల అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!