Arvind Kejriwal : బీజేపీ ఓట‌మి ఖాయం ఆప్ విజ‌యం త‌థ్యం

ఆప్ చీఫ్‌..ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : గుజ‌రాత్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మ‌రింత వేడెక్కింది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం సాగుతోంది. గ‌త 27 ఏళ్లుగా వ‌రుస‌గా ఎన్నిక‌వుతూ అధికారంలో కొన‌సాగుతూ వ‌స్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు ఈసారి శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.

గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ , కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే పోటీ ఉండేది. కానీ ఈసారి చ‌తుర్ముఖ పోటీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు ఆప్ బ‌రిలో ఉంది. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇక్క‌డ రిపీట్ అవుతాయ‌ని జోష్యం చెప్పారు. బీజేపీ ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని ఆప్ స‌త్తా చాటుతుంద‌ని, క‌నీసం 92 సీట్లు త‌మ‌కు వ‌స్తాయ‌ని అన్నారు. గుజ‌రాత్ రాష్ట్రంలో వ్యాపార‌, వాణిజ్య ప‌రంగా పేరొందిన సూర‌త్ లోనే త‌మ‌కు 7 నుంచి 8 స్థానాలు ద‌క్క‌నున్నాయ‌ని చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) .

త‌మ పార్టీ సీఎం అభ్య‌ర్థి ఇసుదాన్ గాధ్వీ, పాటిదార్ కోటా మాజీ నాయ‌కుడు అల్ఫేశ్ క‌తీరియాలు ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇక భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. జాబ్స్ రావాలంటే, నిరుద్యోగం పోవాలంటే ఆప్ కు ఓటు వేయాల‌ని కోరారు కేజ్రీవాల్.

Also Read : గుజ‌రాత్ ఎన్నిక‌ల విరాళాల్లో బీజేపీ టాప్

Leave A Reply

Your Email Id will not be published!