IFFI Jury Head : కాశ్మీర్ ఫైల్స్ లో స‌త్తా లేదు – ఇఫీ జ్యూరీ

ఆ సినిమాకు అంత సీన్ లేదని కామెంట్

IFFI Jury Head : దేశ వ్యాప్తంగా వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఊహించ‌ని దాని కంటే ఎక్కువ‌గా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇందుకు సంబంధించి దేశ ప్ర‌ధాన‌మంత్రితో సహా భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు, ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల‌న్నీ గంప గుత్త‌గా సినిమాకు ప్ర‌చారం చేసి పెట్టాయి.

దీనిపై ప‌లు విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. స‌మ‌స్య వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ ఎక్కువ క్యాంపెయిన్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. తాజాగా గోవాలో కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఇఫీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించిన ది కాశ్మీర్ ఫైల్స్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఇఫీ జ్యూరీ ప్రెసిడెంట్, ప్ర‌ముఖ ఇజ్రాయెల్ ద‌ర్శ‌కుడు న‌ద‌వ్ లాపిడ్(IFFI Jury Head)  .

ఈ చిత్రం ఇఫీకి అర్హ‌త పొందేందుకు త‌గ‌ద‌ని పేర్కొన్నారు. భారీ ఎత్తున ప్ర‌చారం చేశార‌ని, కానీ సినిమాలో స‌త్తా ఏమీ లేద‌న్నారు. ఒక సినిమాకు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఏవీ లేవ‌ని పేర్కొన‌డం సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా కు చెందిన అంత‌ర్జాతీయ పోటీ విభాగంలో ది కాశ్మీర్ ఫైల్స్ చేర్చేందుకు త‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు న‌ద‌వ్ లాపిడ్.

ఇఫీ ముగింపు కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా లాపిడ్ తో పాటు అమెరిక‌న్ నిర్మాత జింకో గోటో, ఫ్రెంచ్ ఫిల్మ్ ఎడిట‌ర్ పాస్కేల్ చ‌వాన్స్ , ఫ్రెంచ్ డాక్యుమెంట‌రీ ఫిల్మ్ మేక‌ర్ జేవియ‌ర్ అంగ‌గులో బార్టురెన్ , భార‌తీయ ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్ జ్యూరీలో ఉన్నారు.

Also Read : ‘జిన్ పింగ్’ ఇంకానా ఇక‌పై చెల్ల‌దు

Leave A Reply

Your Email Id will not be published!