IFFI Kashmir Files : ఫిలిం ఫెస్టివ‌ల్ లో కాశ్మీర్ ఫైల్స్ దుమారం

జ్యూరీ ప్రెసిడెంట్ కామెంట్స్ క‌ల‌క‌లం

IFFI Kashmir Files : మ‌రోసారి ది కాశ్మీర్ ఫైల్స్ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. గోవా వేదిక‌గా జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (ఇఫీ)లో(IFFI Kashmir Files)  ఈ చిత్రం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు జ్యూరీ ప్రెసిడెంట్ , ఇజ్రాయెల్ కు చెందిన నిర్మాత‌, ద‌ర్శ‌కుడు నాద‌వ్ లాపిడ్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇక వివేక్ అగ్నిహోత్రి ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం కాశ్మీరీ పండిట్ల వ‌ల‌స ఆధారంగా తీశారు. త‌క్కువ పెట్టుబ‌డితో తీసిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఆపై కోట్లు కొల్ల‌గొట్టింది. ఈ సంద‌ర్బంగా జ్యూరీ హెడ్ నాద‌వ్ లాపిడ్ మాట్లాడుతూ ది కాశ్మీర్ ఫైల్స్ ఇఫీకి అర్హ‌త సాధించేంత స‌త్తా లేద‌న్నాడు.

ఇటువంటి ప్ర‌తిష్టాత్మ‌క చ‌ల‌న చిత్రోత్స‌వంలో క‌ళాత్మ‌క‌, పోటీ విభాగానికి ఇది త‌గ‌ని ప్ర‌చార చిత్రంగా త‌మ‌కు అనిపించ‌ద‌ని అన్నారు. ఇలా చెప్ప‌డం కూడా తాను బాధ ప‌డుతున్నాన‌ని అన్నారు. బీజేపీ స‌ర్కార్ , శ్రేణులు పూర్తిగా మ‌ద్ద‌తు ప‌లికారు. కాగా ఈ చిత్రం మ‌త ప‌ర‌మైన సెంటిమెంట్ ల‌ను పెంచింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

లాపిడ్ ను చాలా మంది ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతుండ‌గా బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, హిందూత్వ వాదులు మాత్రం తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఈ మొత్తంపై దుమారం చెల‌రేగ‌డంతో ఇఫీ బోర్డు స్పందించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. లాపెడ్ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మైన‌విగా పేర్కొంది.

Also Read : కాశ్మీర్ ఫైల్స్ లో స‌త్తా లేదు – ఇఫీ జ్యూరీ

Leave A Reply

Your Email Id will not be published!