Suprme Court : తెలంగాణ స‌ర్కార్ పై ‘సుప్రీం’ సెటైర్

జ్యోతిష్యం ఆధారంగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి

Suprme Court : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో కేవ‌లం ఎన్నిక‌ల సంఘం సూచించిన‌ట్లుగా కాకుండా జ్యోతిష్యం ఆధారంగా ఎన్నిక‌లు తెలంగాణ‌లో జరుగుతాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ఎక్క‌డైనా ఈసీ నిర్ణ‌యించిన‌ట్లుగా జ‌రుగుతాయి కానీ సీఎం కేసీఆర్ పాల‌నలోని తెలంగాణలో అలా జ‌ర‌గ‌వ‌న్నారు. ఇందుకు 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ఉద‌హ‌రించింది. ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్టు న‌మోదు చేసి అరెస్ట్ చేసింది.

ఆయ‌నకు ఇటీవ‌లే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని ష‌ర‌తులు విధించింది. అన‌వ‌స‌ర‌మైన కామెంట్స్ చేయ‌డం మానుకోవాల‌ని సూచించింది. ఇదే స‌మ‌యంలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్టు న‌మోదు చేయ‌డం దేశంలో మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా రాజా సింగ్ ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలంటూ తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రేం సింగ్ రాథోడ్ త‌ర‌పు న్యాయ‌వాది సుప్రీంకోర్టులో(Suprme Court)  పిటిషన్ దాఖ‌లు చేశారు. దీనిపై ఇవాళ విచార‌ణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాజా సింగ్ పై అనేక క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని వెంట‌నే తొల‌గించాల‌ని కోరింది. ఈ కేసును విచారించాలంటే అన్ని గ్ర‌హాలు ఒకేసారి రావాల‌ని ధ‌ర్మాస‌నం సెటైర్ వేసింది.

ఇదిలా ఉండ‌గా మ‌రోసారి ముంద‌స్తు ముహూర్తం ఖరారు చేసే ప‌నిలో కేసీఆర్ ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : బీఆర్ఎస్ కాదు బందిపోట్ల రాష్ట్ర స‌మితి

Leave A Reply

Your Email Id will not be published!