Chandrababu Naidu : చివరి అవకాశం లేక పోతే మీకే నష్టం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : ఏపీలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు సమయం ఉన్నప్పటికీ తాజాగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఇదేం ఖర్మ పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
తనకు ఇవే ఆఖరి ఎన్నికలంటూ, అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి అవకాశం ఇవ్వమని తాను కోరుతున్నది తన కోసం కాదని కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమని, మీ బాగు కోసమని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ఉన్మాదులుగా తయారై జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ధ్వజమెత్తారు. తాను 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నానని, ఇక తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు.
కానీ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇకనైనా ప్రజలు మేల్కోవాలని లేక పోతే నష్ట పోయేది మీరేనంటూ హెచ్చరించారు. అరాచకం, అవినితీ, అక్రమాలకు ఏపీ సర్కార్ కేరాఫ్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు.
తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామన్నారు. జగన్ సర్కార్ రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందని ఆరోపించారు.
Also Read : ప్రజలతోనే అనుబంధం విజయం తథ్యం – జగన్