Shashi Tharoor Delhi HC : సునంద కేసులో శ‌శి థ‌రూర్ కు షాక్

హైకోర్టును ఆశ్ర‌యించిన ఢిల్లీ పోలీసులు

Shashi Tharoor Delhi HC : దేశ వ్యాప్తంగా సునంద పుష్క‌ర్ మృతి కేసు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. తాజాగా ఈ కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తాజాగా ఆయ‌న‌ను ఈ కేసులో విడుద‌ల చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఇదిలా ఉండ‌గా శ‌శి థ‌రూర్(Shashi Tharoor) భార్య సునంద పుష్క‌ర్ మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆమె మృతి కేసుకు సంబంధించి ట్ర‌య‌ల్ కోర్టు 2021లో విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ న‌గ‌ర పోలీసులు గురువారం ఢిల్లీ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు.

కాగా శ‌శి థ‌రూర్ త‌ర‌పు న్యాయ‌వాది త‌న పిటిష‌న్ కాపీని అంద‌జేయాల‌ని ఢిల్లీ పోలీసుల త‌ర‌పు న్యాయ‌వాదిని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీకే శ‌ర్మ ఆదేశించారు. ఈ అభ్య‌ర్థ‌న త‌నకు అంద చేయ‌లేద‌ని , అది ఉద్దేశ పూర్వ‌కంగా త‌ప్పుడు ఇమెయిల్ ఐడీలో పంపించారంటూ పేర్కొనడం విస్తు పోయేలా చేసింది.

అయితే ట్ర‌య‌ల్ కోర్టు ఆగ‌స్టు 18, 2021 నాటి ఉత్త‌ర్వుల‌కు వ్య‌తిరేకంగా రివిజ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంలో జాప్యాన్ని క్ష‌మించాల‌ని కోరుతూ పోలీసులు చేసిన ద‌ర‌ఖాస్తుపై థ‌రూర్(Shashi Tharoor) ను హైకోర్టు నోటీసు జారీ చేసింది, అంతే కాకుండా ప్ర‌తిస్పంద‌న‌ను కోరింది.

కేసుకు సంబంధించిన కాపీలు, ప‌త్రాల‌ను పార్టీల‌కు మిన‌హా మ‌రెవ్వ‌రికీ అందించ కూడ‌దంటూ కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఈ అంశాన్ని 2023 ఫిబ్ర‌వ‌రి 7న విచార‌ణ‌కు జాబితా చేసింది.

సునంద పుష్క‌ర్ ఓ లగ్జ‌రీ హోట‌ల్ లో శ‌వ‌మై క‌నిపించిన ఏడేళ్ల త‌ర్వాత థ‌రూర్ ఈ కేసులో డిశ్చార్జ్ అయ్యారు.

Also Read : ఒకే దేశం ఒకే విద్యుత్ విధానం – నితీశ్

Leave A Reply

Your Email Id will not be published!