Magunta Srinivasulu Reddy : అమిత్ ఎవరో తెలియదు-మాగుంట
వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
Magunta Srinivasulu Reddy : ఢిల్లీలో చోటు చేసుకున్న లిక్కర్ స్కాం వ్యవహారం కలకలం రేపింది. ఈ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ విజయ సాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను చేర్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
అంతే కాదు మొత్తం ఈ కేసులో 36 మంది పాలు పంచుకున్నారని, మొత్తం 173 ఫోన్లు వాడారని, వాటిలో 156 ఫోన్లను ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. తమకు కేవలం 17 ఫోన్లు మాత్రమే దొరికాయని మొత్తం సమాచారం దొరక లేదని తెలిపింది ఈడీ. అమిత్ అరోరాను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసింది ఈడీ.
రిమాండ్ కు పంపించింది కోర్టు. సౌత్ గ్రూప్ రూ. 100 కోట్లు అమిత్ అరోరా కు ఇచ్చారని తెలిపింది. సౌత్ గ్రూప్ లో శరత్ చంద్రా రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Srinivasulu Reddy) , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెంబర్లుగా ఉన్నారని స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
ఈ ముడుపులను అమిత్ అరోరాకు ఇచ్చారని అతడి ద్వారా విజయ్ నాయర్ కు ఇచ్చారని ఆ డబ్బులను ఆప్ కు ఇచ్చారని తెలిపింది ఈడీ. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదంతా పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. తాను , తన ఫ్యామిలీ కొన్నేళ్ల నుంచి లిక్కర్ వ్యాపారంలో కొనసాగుతూ వస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read : చివరి అవకాశం లేక పోతే మీకే నష్టం