YS Sharmila : కేటీఆర్ భార్య ఆంధ్రా ఆమె కాదా – షర్మిల
ఆమెకు ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది
YS Sharmila : నాకు ప్రశ్నించే హక్కు లేదా. మంత్రి కేటీఆర్ భార్య ఆంధ్రా ఆమె కాదా. మరైతే ఇప్పుడు ఆంధ్రా వాళ్లను వెళ్లి పోమంటే ఆయన తన భార్యకు విడాకులు ఇస్తారా అని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) . ఆమె గురువారం గవర్నర్ తమిళిసైని కలిశారు.
ఈ సందర్భంగా తనకు ప్రాణ భయం ఉందన్నారు. టీఆర్ఎస్ గూండాలు తనపై దాడికి పాల్పడే ఛాన్స్ ఉందన్నారు. ఏమైనా జరిగితే పూర్తిగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను మరోసారి ఆమె టార్గెట్ చేశారు.
ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్లు దోచుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు (రైడ్స్ ) జరపాలని డిమాండ్ చేశారు షర్మిల. ఉన్న పళంగా సోదాలు జరిపితే లక్ష కోట్లు దొరుకుతాయన్నారు. దేశంలోనే కేసీఆర్ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ అని అన్నారు.
ఉద్యమ సమయంలో ఏమీ లేని వాళ్లకు రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వేల కోట్లు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు షర్మిల. నర్సంపేట లో జరిగిన ఘటన గురించి, దాని తర్వాత జరిగిన పరిణామాలు, అరెస్ట్ చేసిన విధానం గురించి ఆమె గవర్నర్ తమిళి సైకి వివరించారు.
టీఆర్ఎస్ నాయకులు తాలిబన్లు లాగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. సీఎం కూతురు ఇప్పుడు లిక్కర్ రాణిగా మారిందన్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల(YS Sharmila) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : నాకేమైనా అయితే కేసీఆర్ దే బాధ్యత – షర్మిల