PM Modi : ఖర్గే కామెంట్స్ మోదీ సీరియస్
రాముడు..రావణుడు ఎవరో తెలియదా
PM Modi : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై నిప్పులు చెరిగారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) . గురువారం గుజరాత్ రాష్ట్రంలో ఓ వైపు మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. మరో వైపు రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా తనను రావణుడితో పోల్చిన మల్లికార్జున్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్ర తెలియని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారమంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలకులు చేసిన పాపానికి గుజరాత్ ప్రజలు ఎన్నో రకాలుగా నష్టానికి గురయ్యారని అన్నారు. అందుకే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భారతీయ జనతా పార్టీకి గత 27 సంవత్సరాలుగా అధికారాన్ని కట్ట బెడుతూ వచ్చారని చెప్పారు.
ఇంతకంటే తమ పనితీరుకు నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. తనను మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఏం అర్హత ఉందని తనను విమర్శించేందుకంటూ ప్రశ్నించారు. రామభక్తులు కలిగిన ఈ దేశంలో రావణుడు అంటూ పిలవడం ఏ మాత్రం ఆయనకు సరికాదన్నారు.
వయస్సుకు, అనుభవానికి తాను గౌరవం ఇస్తున్నానని ఇదేనా కాంగ్రెస్ పార్టీ నేర్పిన సంస్కారం అంటూ ప్రశ్నించారు. తనను కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలన్నీ తమ సమయాన్ని వినియోగిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
వారి తిట్లు, శాపనార్థాలు తనకు దీవనెలని అన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. కొన్ని రోజుల కిందట ఓ కాంగ్రెస్ నాయకుడు అనరాని మాటలన్నారు. మరొకరు నన్ను హిట్టర్ తో పోల్చారంటూ పేర్కొన్నారు.
Also Read : రాహుల్ యాత్రలో ‘స్వర భాస్కర్’