Jairam Ramesh Modi : మోదీ విధానం దేశానికి ప్రమాదం – జైరాం
ప్రశ్నించక పోతే మనల్ని అమ్మేస్తారు
Jairam Ramesh Modi : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం రమేష్(Jairam Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన టార్గెట్ చేశారు. గురువారం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి అసంబద్ద విధానాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయని హెచ్చరించారు.
ఇకనైనా ప్రజలు మేల్కోవాలని సూచించారు. లేక పోతే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టిన మోదీ చివరకు ప్రజలు కూడా పనికొస్తారంటే వాళ్లను కూడా అమ్మకానికి పెడతాడంటూ ఎద్దేవా చేశారు జైరాం రమేష్ . తమ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేసుకుందని చెప్పారు.
ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోందన్నారు. అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు జైరాం రమేష్. ఇదిలా ఉండగా డిసెంబర్ 24న రాహుల్ పాదయాత్ర ఢిల్లీకి చేరుకుంటుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ఇక్కడ ఐదు రోజుల పాటు విరామం తీసుకుంటారని స్పష్టం చేశారు.
రాహుల్ వెంటనే ఉన్న జైరాం రమేష్(Jairam Ramesh) మధ్య ప్రదేశ్ లోని నజర్ పూర్ లో మాట్లాడారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు ఆర్థిక అసమానతల్ని, సామాజిక విద్వేషాన్ని, రాజకీయ నియంతృత్వాన్ని సృష్టిస్తున్నాయని ఇది ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం అని హెచ్చరించారు.
యాత్రతో పాటు కొనసాగుతూ వస్తున్న వాహనాలు, కంటైనర్లు ప్రయాణానికి అవసరమైన సేవలు అందించాల్సి ఉన్నందున యాత్రకు కొంత విరామం ఇవ్వాల్సి వచ్చిందన్నారు జైరాం రమేష్.
Also Read : ఖర్గే కామెంట్స్ మోదీ సీరియస్