Mumtaz Patel : ఈసారి ఎన్నిక‌ల్లో అందుకే పోటీ చేయ‌లేదు

అహ్మ‌ద్ ప‌టేల్ కూతురు ముంతాజ్ ప‌టేల్

Mumtaz Patel: గుజ‌రాత్ లో 182 సీట్ల‌కు సంబంధించి మొద‌టి విడ‌త పోలింగ్ స‌మ‌యం దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీల‌క‌మైన నాయ‌కుడిగా పేరొందారు దివంగ‌త అహ్మ‌ద్ ప‌టేల్. ఆయ‌న కీల‌క‌మైన పాత్ర పోషించారు. గురువారం ప‌టేల్ కూతురు ముంతాజ్ ప‌టేల్(Mumtaz Patel) త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మీరెందుకు ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేద‌ని అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఇంకా త‌న‌కు రాజ‌కీయాలు అర్థం కాలేద‌ని, ఇంకా స‌మ‌యం ఉంద‌న్నారు. అంత వ‌ర‌కు అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు ఏనాడూ ప‌ద‌వుల మీద ఆశ లేద‌న్నారు. కాలం వ‌చ్చిన‌ప్పుడు , స‌మ‌యం స‌హ‌క‌రించిన‌ప్పుడు పోస్టులు అవంత‌ట అవే వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు ముంతాజ్ ప‌టేల్. పార్టీ ప‌రంగా ఎల్ల‌ప్పుడూ హై కమాండ్ త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని పేర్కొన్నారు. ఇక గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై కూడా కీల‌క కామెంట్స్ చేశారు.

తొలి విడ‌తలో నువ్వా నేనా అన్న పోటీ నెల‌కొంద‌ని , అంక‌లేశ్వ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు ముంతాజ్ ప‌టేల్(Mumtaz Patel). ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు బీజేపీ పాల‌న ప‌ట్ల విసిగి పోయార‌ని , ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ముంతాజ్ ప‌టేల్ భ‌రూచ్ లోని అంక్లేశ్వ‌ర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కాగా వ‌చ్చే ఏడాది త‌ర్వాత ఆమె లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : జి20కి నాయ‌క‌త్వం దేశానికి ద‌క్కిన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!