Congress Modi : మోదీ కామెంట్స్ కాంగ్రెస్ సీరియస్
మాజీ పీఎంపై ప్రధాని కామెంట్స్
Congress Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని(Congress Modi) రావణాసురిడితో పోల్చడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండి పడుతుండగా గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గేపై.
ఆయన వయస్సుకు తగిన రీతిలో వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ ను మరిచి పోయారా అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దేశాన్ని అమ్మకానికి పెట్టిన ఘనత మోదీ అంటూ ఎద్దేవా చేసింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుణ్యం వల్లనే ఇవాళ దేశం ఇలా ఉండగలిగిందని పేర్కొంది. కేవలం కులం, ప్రాంతం, మతం, విద్వేషాలను రెచ్చ గొడుతూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రధానమంత్రికి తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది.
ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రావణాసురుడు అన్న దాంట్లో తప్పేమీ లేదని తెలిపింది. ఇందులో ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఖర్గే వాస్తవాన్ని చెప్పారని, దానిని జీర్ణించుకోలేక పోతే ఎలా అని ఎద్దేవా చేసింది.
ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయింది. ప్రధానంగా గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో జీవిత ఖైదుకు గురైన 11 మందిని ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించింది. ఈ దేశంలో కాషాయ ఉన్మాదం చెలరేగతోందని ఆరోపించింది.
Also Read : హిందువులు అల్లర్లకు దూరం – సీఎం