Akhilesh Yadav Yogi : ద్వేషం..ప్రతీకారం మా అభిమతం కాదు
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యోగిపై
Akhilesh Yadav Yogi : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం యోగిపై ఓ ఫైల్ తన వద్దకు వచ్చిందన్నారు అఖిలేష్ యాదవ్.
కానీ తాను పనిగట్టుకుని ద్వేష భావంతో చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతీకారానికి పాల్పడ లేదని స్పష్టం చేశారు. ఆయనపై కేసు కూడా నమోదైందన్నారు. రాజకీయాల్లో కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఆనాడు తిరిగి తాను ఫైల్ ను వెనక్కి పంపించానని వెల్లడించారు అఖిలేష్ యాదవ్.
ఇదిలా ఉండగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ తో పాటు యూపీలో ఉన్న యోగి ఆదిత్యానాథ్(CM Yogi) ప్రభుత్వం పూర్తిగా ద్వేషం, ప్రతీకారంతో రగిలి పోతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా సీఎంగా ఉన్న యోగి కావాలని ద్వేష పూరితంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు.
ప్రధానంగా ప్రతిపక్షాలను , నేతలను టార్గెట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే తాము కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని హెచ్చరించారు అఖిలేష్ యాదవ్.
తన తండ్రి, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈనెల 5న పోలింగ్ జరుగుతుంది. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎస్పీ తరపున పోటీ పడుతోంది.
Also Read : మాట్లాడే ముందు ఆలోచించాలి – ముంతాజ్