Rahul Gandhi : శ్రీరాముడినే కాదు సీతను గౌరవించండి
బీజేపీ శ్రేణులకు రాహుల్ గాంధీ హితబోధ
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సీరియస్ కామెంట్స్ చేశారు. జై శ్రీరాం తో పాటు జై సీత కూడా అని పిలవాలని సూచించారు. దేనిని వాడుతున్నారో వాటి గురించి ముందు తెలుసు కోవాలని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ, దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ.
ఇప్పటి వరకు ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులో కన్యాకుమారి నుంచి మొదలైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తయింది. ప్రస్తుతం ఎంపీలో కొనసాగుతోంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా అన్ని వర్గాల వారు రాహుల్ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన చేపట్టిన యాత్ర ఒక రకంగా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఆయన ఎక్కడా పార్టీ గురించి కానీ, తమ ఘనమైన వారసత్వం గురించి కానీ ప్రస్తావించడం లేదు. ప్రజల సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకుంటున్నారు. ఆపై ప్రతి ఒక్కరితో ఆయన కలుస్తున్నారు.
రాహుల్ చేపట్టిన యాత్ర కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెంచింది. హే రామ్ , జై సియారాం, జై శ్రీరాం అనే పదాలకు ముందు మోదీ, ఆయన పరివారం అర్థం తెలుసు కోవాలని హితబోధ చేశారు.
తాను కలిసిన పండితుడు పలు అర్థాలు చెప్పారని తెలిపారు. శ్రీరాముడిని సరే అదే సమయంలో ఆయనను అంటి పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చిన సీతను కూడా గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ.
Also Read : ట్విట్టర్ లో హానికరమైన కంటెంట్ కు చెక్