Rahul Gandhi Notice : రాహుల్ గాంధీకి కర్ణాటక హైకోర్టు నోటీసు
కేజీఎఫ్-2 మ్యూజిక్ కాపీ రైట్ కేసు
Rahul Gandhi Notice : ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదు కావడం గమనార్హం. దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలని కోరుతూ పెద్ద ఎత్తున పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు.
ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రలలో భారత్ జోడో యాత్ర పూర్తయింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేజీఎఫ్ -2 సినిమాకు సంబందించిన మ్యూజిక్ ను వాడుకుంది.
దీనిని సవాల్ చేస్తూ సినిమాకు చెందిన నిర్మాతలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి ధిక్కార నోటీసు(Rahul Gandhi Notice) జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఎంఆర్టి మ్యూజిక్ కు చెందిన న్యాయవాది ఎం. ప్రణవ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే , జస్టిస్ అశోక్ ఎస్. కినాగితో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పార్టీకి సంబంధించి భారత్ జోడో యాత్రలో కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ -2 నుండి సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించారంటూ పిటిషన్ దాఖలైంది.
ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ప్రధాన కార్యదర్శి , మీడియా ఇన్ చార్జి జైరాం రమేష్ , సుప్రియా శ్రీనాట్ లకు నోటీసులు జారీ చేసింది.
Also Read : బీజేపీ ర్యాలీ భగ్నానికి టీఎంసీ కుట్ర