Dharmendra Pradhan : ఒడిశా సీఎంపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్
ఆయన అలసి పోయారంటూ సెటైర్
Dharmendra Pradhan : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిజూ జనతాదళ్ పార్టీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై నిప్పులు చెరిగారు. సీఎంకు పాలన చేత కావడం లేదన్నారు. ప్రస్తుతం నిద్ర పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఒడిశా రాష్ట్రంలోని పదంపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ధరేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan). 5న ఇక్కడ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. సీఎం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇలాగైతే మంత్రులను ఎలా కంట్రోల్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి. ఇలాగైతే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ నిలదీశారు.
ఇదిలా ఉండగా మెయిన్ పురి లోక్ సభ స్థానంతో పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం ముగిసింది. పదంపూర్ సీటు పోతుందని సీఎం నవీన్ పట్నాయక్ భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. పూర్తిగా సీఎం ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ ఓట్లు అడుగుతున్నారంటూ ఆరోపించారు.
సీఎం చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఒడిశాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సహకారాన్ని ఎలా మరిచి పోతారంటూ నిలదీశారు సీఎం నవీన్ పటక్నాయక్ ను కేంద్ర మంత్రి. ఎక్కడ ఓడి పోతామోననే భయంతోనే సీఎం బయటకు వచ్చారంటూ సెటైర్ వేశారు.
ఇదిలా ఉండగా 2014లో ఈ సీటును గెలుచుకున్న ప్రదీప్ పురోహిత్ ను బీజేపీ రంగంలోకి దింపింది. 2019లో బిజూ జనతా దళ్ కి చెందిన బిజయ రంజ్ సింగ్ బరిహా చేతిలో ఓడి పోయింది. కాగా అధికారంలో ఉన్న పార్టీ బర్షా సింగ్ బరిహాను రంగంలోకి దింపింది.
Also Read : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు